Telangana Elections: తెలంగాణ‌లో ఇదే రిచెస్ట్ జిల్లా..!

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో రిచెస్ట్ జిల్లా ఏది.. అదే విధంగా పూరెస్ట్ జిల్లా ఏదో తెలుసుకుందాం. వీటితో పాటు మ‌రింత అద‌న‌పు స‌మాచారం మీకోసం.

తెలంగాణ‌లో రిచెస్ట్ జిల్లా

తెలంగాణ రాష్ట్రంలో రిచెస్ట్ జిల్లా ఏది అంటే రంగా రెడ్డి (ranga reddy) (ఇప్పుడు మేడ్చ‌ల్). రంగా రెడ్డి జిల్లా త‌ల‌స‌రి ఆదాయం రూ.7.58 ల‌క్ష‌లుగా ఉంది.

పేద‌ జిల్లా

తెలంగాణ‌లో పేద జిల్లాగా వికారాబాద్ (vikarabad) ఉంది. వికారాబాద్ త‌ల‌స‌రి ఆదాయం కేవ‌లం రూ.154 ల‌క్ష‌లే ఉంది.

పేద న‌గ‌రం

తెలంగాణ‌లో ఆదిలాబాద్ (adilabad) పేద నగ‌రంగా ఉంది. ఇక్క‌డ నిరు పేద‌లు 27.4 శాతం మంది ఉన్నారు. ఆ త‌ర్వాత మ‌హ‌బూబ్ న‌గర్ (26.11 శాతం), నిజామాబాద్ (21.44 శాతం), మెద‌క్ (17.9 శాతం), న‌ల్గొండ (15.3 శాతం) ఉన్నాయి.

అతి శుభ్ర‌మైన న‌గ‌రం

తెలంగాణ‌లో అతి శుభ్ర‌మైన న‌గ‌రం రాజ‌ధాని హైద‌రాబాద్ (hyderabad). స్వ‌చ్ఛ భార‌త్ క్యాంపెయిన్‌లో భాగంగా హైద‌రాబాద్ క్లీనెస్ట్ న‌గ‌రాల్లో ఒక‌టిగా నిలిచింది.

అభివృద్ధి చెందిన, చెందుతున్న‌ న‌గ‌రాలు

హైద‌రాబాద్ (hyderabad)

వ‌రంగ‌ల్ (warangal)

నిజామాబాద్ (nizamabad)

క‌రీంన‌గర్ (karimnagar)

తెలంగాణ‌లోనే అతిపెద్ద జిల్లా

ఇక తెలంగాణ‌లోని అతిపెద్ద జిల్లాగా భ‌ద్రాద్రి కొత్తెగూడెం (bhadradri kothagudem) ఉంది. 7,483 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉంది. ఆ త‌ర్వాత కొమురం భీం (4,300 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు), వ‌రంగ‌ల్ రూర‌ల్ (2175.50 కిలోమీట‌ర్లు) ఉన్నాయి.