Canada: ట్రూడో ఇండియాలో న‌వ్వుల‌పాల‌య్యాడు

Canada India Issue: కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో (justin trudeau) ఇండియాలో న‌వ్వుల‌పాల‌య్యాడ‌ని అన్నారు కెన‌డాకు చెందిన క‌న్‌స‌ర్వేటివ్ పార్టీ నేత పియేర్ పోలివ‌ర్ (Pierre Poilievre). ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశం అయిన ఇండియాలో ట్రూడో న‌వ్వుల‌పాల‌య్యాడ‌ని.. అత‌నికి ఇరు దేశాల మ‌ధ్య దౌత్య సంబంధాల‌ను ఎలా మెరుగుప‌రుచుకోవాలో తెలీద‌ని ఆరోపించారు. 2024లో జ‌ర‌గ‌బోయే కెన‌డా ఎన్నిక‌ల్లో పోలివ‌ర్ కూడా ప్ర‌ధాని ప‌ద‌విలో ఉన్నారు. కెన‌డా ప్ర‌జ‌లు కూడా ఇక ట్రూడో అవ‌స‌రం లేద‌ని పోలివ‌ర్ ప్ర‌ధాని అయితే బాగుంటుంద‌ని అనుకుంటున్న‌ట్లు ఓ స‌ర్వేలో వెల్ల‌డైంది. ట్రూడో అస‌మ‌ర్థుడు కాబ‌ట్టే ఇండియా అక్క‌డున్న కెన‌డా దౌత్యాధికారుల‌ను వెనక్కి వెళ్లిపోవాల‌ని ఆదేశించింద‌ని అన్నారు.

ఇప్పుడు కెన‌డా ప్ర‌పంచంలోని ప‌వ‌ర్‌ఫుల్ దేశాల‌న్నింటితో గొడ‌వ‌లు పెట్టుకుంద‌ని మండిప‌డ్డారు. తాను కెన‌డా ప్రధాని అయితే మ‌ళ్లీ భార‌త్‌తో మెరుగైన స‌త్సంబంధాలు ఏర్ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని అన్నారు. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ట్రూడోను డోర్ మ్యాట్‌లా వాడుకుంటున్నార‌ని ఆరోపించారు. కెన‌డాలో హిందూ ఆల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను కూడా పోలివ‌ర్ ఖండించారు. ఇలా చేసేవారిపై క్రిమిన‌ల్ చార్జెస్ వేయాల‌ని డిమాండ్ చేసారు. (canada india issue)