Hamas: బందీల‌ను వ‌దిలేస్తామంటే ఇజ్రాయెల్ ఒప్పుకోవ‌డంలేదు

Israel Gaza War: గాజాకు చెందిన ఉగ్ర‌వాద సంస్థ హ‌మాస్ (hamas) ఇజ్రాయెల్‌పై షాకింగ్ ఆరోప‌ణ‌లు చేసింది. ఇజ్రాయెల్‌లో (israel) జ‌రిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌పై దాడులు చేసి ఆ ఫెస్టివ‌ల్‌లో పాల్గొన్న దాదాపు 250 మంది ప్ర‌జ‌ల‌ను హ‌మాస్ త‌మ బందీలుగా చేసుకుంది. అయితే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయ‌డం ఆపితేనే వారిని వ‌దిలేస్తామ‌ని హ‌మాస్ అల్టిమేటం విధించింది.

ఇప్ప‌టికే న‌లుగురు అమెరిక‌న్ల‌ను హ‌మాస్ వ‌దిలేసింది. అయితే మ‌రో ఇద్ద‌రు బందీల‌ను వ‌దిలేస్తాం తీసుకెళ్లండి అని ఇజ్రాయెల్ ప్ర‌భుత్వానికి చెబితే అందుకు ప్ర‌భుత్వం ఒప్పుకోవ‌డంలేద‌ట‌. ఈ విష‌యాన్ని హ‌మాస్ ప్ర‌జాప్ర‌తినిధి వీడియో ద్వారా బ‌య‌ట‌పెట్టారు. దీనిపై ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు (benjamin netanyahu) స్పందిస్తూ.. హ‌మాస్ చేసే విష ప్ర‌చారంపై స్పందించాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని తెలిపారు.