Telangana Elections: 2 స్థానాల నుంచి బ‌రిలోకి..!

తెలంగాణ ఎన్నిక‌లకు (telangana elections) సంబంధించిన త‌మ పార్టీ నుంచి బ‌రిలోకి దిగ‌బోయే అభ్య‌ర్ధుల జాబితాను BJP ఆల్మోస్ట్ ప్ర‌క‌టించేసింది. తొలి జాబితాలో 55 మంది అభ్య‌ర్ధులు ఉన్నారు. అయితే తెలంగాణ ఎన్నిక‌ల్లో ఒక‌టి కంటే ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేస్తున్న‌ది ఇద్ద‌రే నేత‌లు. వారిలో ఒకరు తెలంగాణ ప్ర‌స్తుత సీఎం KCR.. BJP నేత ఈటెల రాజేంద‌ర్ (etela rajender)

KCR త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన గ‌జ్వేల్ (gajwel) నుంచే కాకుండా కామారెడ్డి (kamareddy) నుంచి కూడా పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. అదే విధంగా ఒక‌ప్పుడు BRSలో ఉన్న ఈటెల రాజేంద‌ర్.. అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దాంతో ఆయ‌న్ను BJP అక్కున చేర్చుకుంది. KCRపై ప‌గ తీర్చుకోవాల‌న్న ఉద్దేశంతో ఈటెల నియోజ‌క‌వ‌ర్గం అయిన హుజూరాబాద్‌తో (huzurabad) పాటు గజ్వేల్‌లో కూడా పోటీ చేయాల‌ని హైక‌మాండ్ ఆదేశాలు జారీ చేసింది. దాంతో త‌ప్ప‌నిస‌రి పరిస్థితిలో ఈటెల ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నిక‌ల్లో ఒక‌టి కంటే ఎక్కువ సీట్ల‌లో పోటీ చేసేది ప్ర‌స్తుతానికి వీరిద్ద‌రే అని తెలుస్తోంది.

ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయ‌చ్చు?

సాధార‌ణంగా ఒక అభ్య‌ర్ధి ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేయాలి. కానీ ఇటీవ‌ల రెండు సీట్ల నుంచి పోటీ చేసుకునేందుకు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. దీని ద్వారా ఒక‌టి కాక‌పోతే ఇంకో స్థానంలో గెలిచే అవ‌కాశం ఉంటుంది. రెండు స్థానాల నుంచి గెలిస్తే ఏదైనా ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాజీనామా చేయాలి. అది కూడా 10 రోజుల్లోనే రాజీనామా చేయాలి. ఆ త‌ర్వాత ఆ సీటు ఖాళీగా ఉంటుంది కాబ‌ట్టి ఉప ఎన్నిక‌ల ద్వారా మ‌రో అభ్యర్ధి పోటీ చేసే అవ‌కాశం ఉంటుంది.  (telangana elections)