Supreme Court: కారుకి రోడ్ రోలర్‌కి తేడా అందరికీ తెలుసు..!
BRS పార్టీ సుప్రీంకోర్టులో (supreme court) వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణలో ఎన్నికలు (telangana elections) దగ్గరపడుతున్న సమయంలో BRS పార్టీ గుర్తు కారు కాబట్టి.. కారు లాంటి ఎన్నికల గుర్తుని మరే పార్టీకి కేటాయించకూడదని ఎన్నికల కమిషన్‌పై (election commission) పిటిషన్ వేసింది. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తూ ఇది పనికిరాని పిటిషన్ అని పేర్కొంది. కారు లాంటి గుర్తు ఇచ్చినా అందులో ఏమాత్రం తప్పు లేదని ప్రజలకు కారుకి, రోడ్ రోలర్‌కి మధ్య తేడా బాగా తెలుసని కోర్టు చీవాట్లు పెట్టింది.