Janasena: అధికారంలోకి వ‌చ్చాక జైలుకి పంపేది ఈ కేసు మీదే..!

Pawan Kalyan about Education system: చిన్న పిల్ల‌ల‌కు టోఫిల్ ట్రైనింగ్ ఎందుక‌ని YSRCP ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు జ‌న‌సేనాని (janasena) ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (pawan kalyan) ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, ఇంట‌ర్ క‌ళాశాల‌ల్లో IB (ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాక‌లోరియ‌ట్) వంటి సిల‌బస్‌ను అమ‌లు చేయాల‌ని ఏపీ విద్యాశాఖ నిర్ణ‌యించింది. ఇందుకోసం కేవ‌లం టీచ‌ర్ల ట్రైనింగ్‌కే ప్ర‌భుత్వం 12 నుంచి 1500 కోట్ల వ‌ర‌కు ఖర్చు చేయ‌నుంది. దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందిస్తూ.. అస‌లు చిన్న పిల్ల‌ల‌కు టోఫిల్ ట్రైనింగ్ ఎందుక‌ని ప్ర‌శ్నించారు. టోఫిల్ అనేది అమెరికా వెళ్ల‌డానికి రాసే ప‌రీక్ష అని అది అక్క‌డి యూనివ‌ర్సిటీలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాయ‌ని తెలిపారు.

పిల్ల‌ల‌కి ఇంగ్లీష్ యాక్సెంట్ అవ‌స‌ర‌మ‌ని చెప్తున్నార‌ని కేవ‌లం యాక్సెంట్ కోస‌మే అయితే ఇన్ని వేల కోట్లు ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌వ‌న్ అన్నారు. యాక్సెంట్ కోసం యూట్యూబ్‌లో ఉచిత కోర్సులు కూడా ఉన్నాయ‌ని తెలిపారు. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ‌ అవాక్కులు చవాక్కులు పేల్చ‌కుండా స‌రిగ్గా ఆలోచించి స‌మాధానం ఇస్తార‌ని ఆశిస్తున్నామ‌ని అన్నారు. యాక్సెంట్ ఉంటేనే విద్యార్థులు బాగుప‌డ‌తారు అంటే అమెరికా, బ్రిట‌న్‌లో పేద‌రికం అనేవే ఉండ‌వని పిల్ల‌ల‌కి అర్థంచేసుకునే ధోర‌ణిని అల‌వ‌ర్చాల‌ని చెప్పారు. 2024 ఎన్నిక‌ల త‌ర్వాత త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే YSRCP ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు చేసిన అక్ర‌మాల‌లో మొద‌టి విచార‌ణ ఈ IB సంస్థ‌తో ఒప్పందం నుంచే మొద‌ల‌వుతుంద‌ని హెచ్చ‌రించారు.