Shabbir Ali: KCRపై పోటీ చేయ‌నంటున్న నేత‌

Telangana Elections: కామారెడ్డి కాంగ్రెస్ స్థానంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో గ‌డ‌బిడ నెలకొంది. తెలంగాణ సీఎం KCRపై పోటీకి దించేందుకు అధిష్ఠానం షబ్బీర్ అలీని (shabbir ali) ఎంచుకుంది. కానీ ఇందుకు ష‌బ్బీర్ అలీ రెడీగా లేరు. ఆయ‌న పోటీ చేయ‌లేనని అంటున్నారు. షబ్బీర్ అలీని కాదని కొత్త మొహాలని ఎలా బరిలో పెట్టాలని అధిష్టానం త‌ల‌ప‌ట్టుకుంది. ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్, లేదా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ పేర్లు పరిశీలన‌లో ఉన్నాయి.