Canada: 41 దౌత్యాధికారులు వెన‌క్కి.. భార‌త్‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌నుంది?

India Canada Issue: భార‌త్ అల్టిమేటం విధించిన నేప‌థ్యంలో ఇండియా (india) నుంచి కార్య‌క‌లాపాలు చేప‌డుతున్న కెన‌డా (canada) దౌత్యాధికారుల్లో దాదాపు 41 మందిని కెన‌డా వెన‌క్కి తీసుకుంది. కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో (justin trudeau) హ‌త్య‌కు గురైన ఖ‌లిస్తానీ తీవ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ (hardeep singh nijjar) విష‌యంలో భార‌త్‌పై నింద మోపిన నేప‌థ్యంలో భార‌త్ ఈ విధంగా ప‌గ తీర్చుకుంది.

అక్టోబ‌ర్ నెల‌లోగా భార‌త్‌లో ఉంటున్న సగం మంది కెన‌డా దౌత్యాధికారుల‌ను వెన‌క్కి పిలిపించుకోవాల‌ని లేదంటే వారిని గెంటాల్సి ఉంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం అల్టిమేటం విధించింది. దాంతో కెన‌డా 41 మంది దౌత్యాధికారుల‌ను వెన‌క్కి ర‌ప్పించుకుంది. ఇప్పుడు భార‌త్‌లో కెన‌డాకు చెందిన దౌత్య‌వేత్త‌లు కేవ‌లం 21 మందే ఉన్నారు.

భార‌త్‌లో త‌క్కువ దౌత్యాధికారులు ఉన్న నేప‌థ్యంలో ఇండియా నుంచి కెన‌డాకు వీసా స‌ర్వీసుల విష‌యంలో మ‌రింత జాప్యం జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. ముంబై, బెంగ‌ళూరు, ఛండీగ‌డ్‌లో ఉంటున్న కెన‌డా ఎంబ‌సీ కార్యాల‌యాల్లో ఇన్ ప‌ర్సన్ స‌ర్వీసులు అంటే ఒక వ్య‌క్తి వీసా, ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసుల కోసం స్వ‌యంగా ఆఫీస్‌కి వెళ్లే విధానాన్ని ప్ర‌స్తుతానికి నిలిపివేసింది.

ఎవ‌రికైనా వీసా, ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసుల్లో ఏదైనా సాయం కావాలంటే వారు ఫోన్ల ద్వారా సంప్ర‌దించాలి లేదంటే న్యూఢిల్లీకి కార్యాల‌యానికి అయినా వెళ్లాలి. ఇరు దేశాల మ‌ధ్య దౌత్య సంబంధాలు కాస్త పచ్చిగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇండియ‌న్స్ కెన‌డాకు రావాల‌నుకుంటే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కాక‌పోతే ఇమ్మిగ్రేష‌న్, వీసా ప‌నులు ఆల‌స్యం అవుతాయ‌ని తెలిపారు. (india canada issue)