Elections: ఈ రాష్ట్రంలో 81% మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే!
ఎన్నికల (elections) సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఎంత మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారు అనే సర్వే మొదలైంది. ఈ సర్వేలో బయటకొచ్చిన విషయం ఏంటంటే.. ఒకే ఒక్క రాష్ట్రంలో 80% మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనట. వారంతా కూడా BJP ఎమ్మెల్యేలే. ఇంతకీ అదే రాష్ట్రం అంటే.. మధ్యప్రదేశ్ (madhya pradesh).
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ సాధారణ వ్యక్తి తలసరి ఆదాయం (per capita income) ఏడాదికి రూ.1,40,583. అంటే నెలకు రూ.1000 వరకు సంపాదిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని 186 మంది ఎమ్మెల్యేలు అంటే దాదాపు 81% మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. 230 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వద్ద రూ.10.76 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 2013లో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరిగినప్పుడు ఇదే ఎమ్మెల్యేల వల్ల రూ.5 కోట్ల విలువైన ఆస్తులు ఉండేవి. ఇప్పుడు వాటి విలువ 105 శాతానికి పెరిగింది. (elections) ఇక 2008 సమయంతో పోల్చుకుంటే వీరి ఆస్తులు 647 శాతానికి పెరిగాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 97 మంది ఎమ్మెల్యేలు లక్షాధికారులుగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురు కోటీశ్వరులే. 2008 ఎన్నికల సమయంలో మధ్యప్రదేశ్‌లో కేవలం 84 మంది ఎమ్మెల్యేలే ఉండేవారు. 2013 ఎన్నికల నాటికి ఆ సంఖ్య 161కి చేరింది. 2018 ఎన్నికల సమయానికి ఈ 161 కాస్తా 186కి చేరింది. 2008లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య 118. అయితే ఈ సంఖ్య 2018 ఎన్నికల నాటికి 9 శాతానికి పెరిగి 107 అయ్యింది. (madhya pradesh elections)
మధ్యప్రదేశ్ రిచెస్ట్ ఎమ్మెల్యే ఇతనే
ఇక మధ్యప్రదేశ్‌లోని రిచెస్ట్ ఎమ్మెల్యేలలో అత్యధిక ధనవంతుడు సంజయ్ పాఠక్ (sanjay pathak). ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన నేత. ఇతను ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇతని ఆస్తుల విలువ రూ. 226 కోట్లు. 2013లో ఇతని ఆస్తుల విలువ రూ.141 కోట్లుగా ఉంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ (kamalnath) ఆరో రిచెస్ట్ నేతగా ఉన్నారు. ఇతని ఆస్తుల విలువ రూ.124 కోట్లు. ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (shivraj singh chauhan) ఆస్తుల విలువ కేవలం రూ.7 కోట్లు. (elections)
పేద ఎమ్మెల్యేలు వీరే..!
ఇక పేద ఎమ్మెల్యేల విషయానికొస్తే.. ఆరుగురు BJP నుంచి నలుగురు కాంగ్రెస్ (congress) నుంచి ఉన్న ఎమ్మెల్యేల వద్ద అసలు ఆస్తులు ఏమీ లేవు.
గిరిజన BJP ఎమ్మెల్యే – రామ్ డంగోరే (రూ.50,000)
BJP ఎమ్మెల్యే- ఉషా ఠాకూర్ ( రూ. 7 లక్షలు)
కాంగ్రెస్ గిరిజన ఎమ్మెల్యే – శరద్ కోల్ (రూ.8.4 లక్షలు)
40% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
మధ్యప్రదేశ్‌కు చెందిన 40% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 20% మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి.