High Court: అమ్మాయిలు ఆ కోరికను అదుపులో ఉంచుకోవాలి
కలకత్తా హైకోర్టు (high court) ఓ కేసు విషయంలో తీర్పు వెల్లడిస్తూ 18 ఏళ్లు నిండని అమ్మాయిలు సెక్స్ కోరికను అదుపులో ఉంచుకోవాలని తెలిపింది. కలకత్తాకు చెందిన మైనర్ యువకుడు తన మైనర్ గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొన్న నేపథ్యంలో వారి తల్లిదండ్రులు కోర్టుకెక్కారు. అయితే ఈ కేసులో ఇద్దరూ మైనర్లే కావడంతో జడ్జ్ శిక్షకు బదులు ఒక సందేశాన్ని తీర్పుగా వెల్లడించారు.
ఆడపిల్లలు, మగపిల్లలకు ఆ కోరికలు తీరాలంటే వారి వయసు కచ్చితంగా 18 ఉండాలని.. అది కూడా వారి ఇష్టంతోనే ఆ కార్యం జరగాలని తెలిపారు. పాఠశాలల్లో సెక్స్ ఎడుకేషన్ అనే సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలని ఇలాంటి విషయాలు సిగ్గు పడి దాస్తే మున్ముందు మరిన్ని సమస్యలు వస్తాయని తెలిపారు. ఆడపిల్లలు తమ కోరికలను 18 ఏళ్లు వచ్చే వరకు అదుపులో ఉంచుకోవాలని ఆ తర్వాత వారు ఏం చేస్తున్నారు అనేదానిపై అవగాహన కలిగి ఉంటారు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఇక అబ్బాయిలు కూడా అమ్మాయిలను వారి ప్రైవసీని గౌరవించగలిగేలా తమ మైండ్‌సెట్ మార్చుకోవాలని ఆదేశించారు. (calcutta high court)