Microsoft: మీటింగ్స్ ఇష్టంలేని వారికి గుడ్ న్యూస్..!
ఉదయాన్నే ఆఫీస్ మీటింగ్స్ (office meetings) అటెండ్ అవ్వాలంటే చిరాకే. వర్క్ ఫ్రం హోంలో ఉన్నవారికి ఈ ఆఫీస్ మీటింగ్స్ అంటే మరీ కోపం. మీలాంటి వారి కోసమే మైక్రోసాఫ్ట్ (microsoft) ఓ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ai) టూల్‌ని తీసుకొచ్చింది. ఈ టూల్ ద్వారా మీ బదులు ఈ టూలే మీటింగ్స్ అటెండ్ అవుతుంది. ఈ టూల్‌ని బిల్డ్ చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది. నవంబర్ 1 నుంచి దీని ట్రయల్ రన్ చేయబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
ఇంతకీ ఈ టూల్ పేరేంటి?
ఈ టూల్ పేరు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ (microsoft 365 copilot). మీటింగ్‌కి హాజరుకాలేని పక్షంలో ఇదే మీ బదులు అటెండ్ అవుతుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ మిస్సయిపోయాం అనే భయం కూడా లేదు. మీటింగ్‌లో ఏం జరిగింది అనే విషయాలను మీకు తెలియజేస్తుంది. అంతేకాదు మీ కోసం మెయిల్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కూడా చేసిపెడుతుంది. అయితే ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఉద్యోగాలు రిస్క్‌లో పడే అవకాశం కూడా ఉంది. మరీ చిన్న చిన్న వాటికి కూడా ఏఐ టూల్స్ వచ్చేస్తే భవిష్యత్తులో ఐటీ కంపెనీలన్నీ ఏఐలనే వర్కర్లుగా నియమించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే యూరప్, చైనాల ఏఐ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ టెక్నాలజీ మంచిది కాదు. ఎందుకంటే ఈ రెగ్యులేషన్స్ ప్రకారం యూజర్లకు తాము వాడుతున్నది హ్యూమన్ ద్వారా క్రియేట్ అయిన కంటెంటా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అనేది చెప్పాల్సి ఉంటుంది.