Pravallika Suicide: పుణెలో ప‌ట్టుబ‌డ్డ నిందితుడు

చిక్క‌డ‌ప‌ల్లిలోని అశోక్ న‌గ‌ర్‌లో ఉంటూ గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్న యువ‌తి ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య (pravallika suicide) కేసు ముగింపుకు వ‌చ్చింది. ప్ర‌వ‌ళిక‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు శివ‌రాంను పోలీసులు పుణెలో అరెస్ట్ చేసారు. ప్ర‌వ‌ళిక ఆత్మహ‌త్య చేసుకుంద‌ని తెలీగానే శివ‌రాం పారిపోయాడు. ఇప్పుడు శివ‌రాం తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నాడు.