KTR: ప్రవళిక తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం
KTR in Karimnagar: ఇటీవల చిక్కడపల్లిలో ఉంటూ గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్న ప్రవళిక (pravallika suicide) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్స్ పరీక్షలు వాయిదా పడుతున్నాయన్న కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఇతర పార్టీ నేతలు ఆరోపించారు. కానీ ఆమె ప్రేమలో విఫలమైనందునే చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ.. తమ రాష్ట్రంలో ఓ ఆడపిల్ల చనిపోయింది కాబట్టి ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని.. ప్రవళిక తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR హామీ ఇచ్చారు.
ప్రవళిక తల్లిని కలిసిన KTR
కాగా.. KTR.. ప్రవళిక తల్లిని కలిసారు. తన బిడ్డ మరణానికి శివరామ్ అనే వ్యక్తి కారణమని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె మంత్రిని కోరారు. ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమని మంత్రి వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంభందించిన అన్ని వివరాలు DGP ద్వారా తెలుసుకున్నానని, ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.