Telangana Elections: రాహుల్ గాంధీ కాదు ఎలెక్ష‌న్ గాంధీ

కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ (rahul gandhi) ఆయన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలని BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) సూచించారు. ఎన్నిక‌లు (telangana elections) వచ్చినప్పుడు వచ్చి ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి దానితో నాలుగు ఓట్లు వస్తాయని అనేది అనాలోచితమైన చర్య అని విమర్శించారు. తెలంగాణ చాలా జాగ్ర‌త్త‌గా వ్యవహరించే సమాజమని, చైతన్యం కలిగిన ప్రజలు అని చెప్పారు.

బోధన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…

“” నిజామాబాద్ జిల్లాలో BRS పార్టీ ఎంత బలంగా ఉందంటే… ఎక్కడెక్కడి నాయకులు ఇక్కడికి వస్తున్న దాన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ‌కు వచ్చే వారందరికీ స్వాగతం చెబుతున్నాం. వచ్చి మీరు ఏం చెప్తారో చెప్పండి. టూరిస్టులుగా వచ్చి చూడండి… నిజామాబాద్ మొత్తం తిరగండి. నిజామాబాద్‌లో పచ్చబడ్డ పొలాలను చూడండి. మంచిగైన కాలువలను చూడండి. నిండుకుండలా ఉన్న ఎస్సారెస్పీని చూడండి. అన్నీ చూసి వెళ్లిపోండి కానీ ఇక్కడ ఉన్న సుహృద్భావ వాతావరణం చెడగొట్టకండి.

65 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కనీస వసతులు క‌ల్పించ‌లేదు. ఇలాంటి పరిస్థితుల్లో BRSతో కాంగ్రెస్ పార్టీ ఎలా పోటీ పడుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో అవసరం లేదు. రాహుల్ గాంధీ వస్తారట. స్వాగతం. వచ్చి అంకాపూర్ చికెన్ రుచి చూడండి. డిచ్పల్లి రామాలయాన్ని సందర్శించండి. బోధన్ వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించండి. కానీ ఇక్కడ ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టకండి“” అని సూచించారు క‌విత‌ (telangana elections)