Gaza War: 23 ఏళ్ల క్రితం బిడ్డను.. నేడు కుటుంబాన్ని కోల్పోయి..
ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదేమో..! గాజాలో (gaza war) పుట్టిన పాపానికి 23 ఏళ్ల క్రితమే కన్నబిడ్డను కళ్ల ముందే పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే యుద్ధంలో తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న విషాదాలు ఇవి. పై ఫోటో కనిపిస్తున్న వ్యక్తి పేరు జమాల్ అల్దుర్రా. ఇటీవల గాజాపై ప్రతీకార చర్యలో భాగంగా ఇజ్రాయెల్ చేపట్టిన మెరుపుదాడుల్లో జమాల్ నలుగురు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాడు. 23 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్, పాలెస్తీనా వర్గాలకు చెందిన ఘర్షణల్లో జమాన్ తన 11 ఏళ్ల బిడ్డను పోగొట్టుకున్నాడు.
2000 సంవత్సరంలో సెప్టెంబర్ 30న ఇజ్రాయెల్, పాలెస్తీనా వర్గాల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ఎటు చూసినా దాడులు, బాంబు పేలుళ్లు, తుపాకీ మోతలు. ఈ ఘర్షణల్లో జమాన్ తన 11 ఏళ్ల కుమారుడిని గట్టినా పట్టుకుని బిక్కుబిక్కు మంటూ కూర్చుండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా తుపాకీల మోత వినపించింది. కళ్లు తెరిచి చూడగానే బిడ్డ రక్తపుమడుగుల్లో ఒడిలో వాడిపోయి ఉన్నాడు. కానీ జమాల్ మాత్రం తప్పించుకోగలిగాడు. ఆ సమయంలో ఓ ఫ్రాన్స్ ఫోటోగ్రాఫర్ తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇజ్రాయెల్, పాలెస్తీనా మధ్య వివాదం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి జమాల్ అతని బిడ్డే నిదర్శనం. 23 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో జమాల్ తన నలుగురు సోదరులను కోల్పోయాడు. ఈ యుద్ధంలో తానెందుకు పోలేదు అనుకుంటూ అనుక్షణం నరకం అనుభవిస్తున్నాడు జమాల్ (gaza war)