న‌వ‌రాత్రుల్లో ఈ రాశులవారిపై అమ్మ అనుగ్ర‌హం ఉంటుంద‌ట‌

న‌వ‌రాత్ర‌ల (spiritual) సందడి మొద‌లైపోయింది. అమ్మ‌వారు రోజుకో అలంక‌ర‌ణ‌లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ఈ న‌వ‌రాత్రుల సమ‌యంలో అమ్మ‌వారి అనుగ్ర‌హం అంద‌రిపైనా ఉంటుంది. తిరుప‌తికి చెందిన ప్ర‌ముఖ జ్యోతిష్యుడు కృష్ణ కుమార్ భార్గ‌వ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కొన్ని రాశుల‌పై మాత్రం అమ్మ అనుగ్ర‌హం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. అవి ఏ రాశులో తెలుసుకుందాం. (navratri)

సింహ (leo)

సింహ రాశిలో పుట్టిన‌వారికి ఈ న‌వ‌రాత్రుల స‌మ‌యంలో ఆర్థిక న‌ష్టాలు తొల‌గిపోతాయ‌ట‌. వారి వ్యాపారాలు మ‌రింత మెరుగుప‌డ‌తాయి. వృత్తిలో మ‌రింత ఎత్తుకు ఎదుగుతారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే మెరుగైన ఫ‌లితాలు అందుకుంటారు. (spiritual)

క‌న్య‌ (virgo)

ఈ న‌వ‌రాత్రుల్లో క‌న్యా రాశిలో పుట్టిన‌వారికి అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గి డ‌బ్బు ఆదా అవుతుంది. త‌మ జీవిత‌భాగ‌స్వాముల నుంచి సపోర్ట్ ల‌భిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవ‌కాశం ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

ధ‌నుస్సు (saggitarius)

ధ‌నుస్సు రాశి వారికి కూడా మంచి లాభ‌దాయ‌కంగా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి మంచి కాలం. ఉద్యోగాలు చేసేవారికి కొత్త అవకాశాలు త‌లుపుత‌డ‌తాయి. పై అధికారుల నుంచి ప్రశంస‌లు అందుకుంటారు.

మ‌క‌ర‌ (capricorn)

మ‌క‌ర రాశిలో పుట్టిన‌వారికి ఉద్యోగంలో ప్రమోష‌న్స్ వ‌చ్చే కాలం ఇది. కాక‌పోతే ప‌ని ప్ర‌దేశాల్లో ఎలాంటి గొడ‌వ‌లు, రాజకీయాల‌కు పాల్ప‌డ‌క‌పోవ‌డం మంచిది. ఓపిగ్గా ఉంటే అన్నీ స‌ర్దుకుంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. (spiritual)

మీన‌ (pisces)

అప్ప‌టివ‌ర‌కు న‌ష్టాల్లో సాగుతున్న వ్యాపారాలు ఇప్పుడు పుంజుకుంటాయి. అన్ని విష‌యాల్లో కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది. ఉద్యోగుల‌కు కూడా మంచి కాలం.

మేష (aries)

మేష రాశిలో పుట్టిన వారికి ఈ న‌వ‌రాత్రుల స‌మ‌యంలో ప్రేమ వ్య‌వ‌హారాల్లో క‌లిసి వ‌స్తుంది. వ్యాపారులు మ‌రిన్ని కాంటాక్ట్స్ పెంచుకుంటారు. దీని వ‌ల్ల వ్యాపారం మ‌రింత అభివృద్ధి చెందుతుంది. (spiritual)