Renu Desai ని పంది ముఖందానా అన్న నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే
నటి రేణ దేశాయ్‌ని (renu desai) ఏదో ఒక రకంగా టీజ్ చేయాలని చూస్తుంటారు కొందరు పనీపాటా లేని నెటిజన్లు. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె టైగర్ నాగేశ్వరరావు (tiger nageswara rao) సినిమాతో ఆమె మళ్లీ వెండితెరపై ఓ కీలక పాత్రతో సందడి చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎప్పటికప్పుడు అప్డేట్లను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ రేణూ ఫోటోపై కామెంట్ చేస్తూ పంది ముఖం దానా అన్నాడు.
వెంటనే ఎప్పటిలాగే రేణూ అతన్ని ఊరికే వదిలేయకుండా ఆ కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి స్టోరీలో పోస్ట్ చేసారు. “” అసలు పరిచయం లేని వారిపై ఎందుకు ఇంత ద్వేషమో నాకు అర్థంకాదు. మీ ఇంట్లో అమ్మానాన్నలు నిన్ను ఇలాగే పెంచారా? ఇలా సోషల్ మీడియాలో ఆడవారిని తిడుతున్నట్లు మీ అమ్మకు తెలుసా? ఇదేనా మీ పెంపకం? అయినా పందులు చాలా క్యూట్‌గా ఉంటాయి. కాబట్టి నేను దానిని కాంప్లిమెంట్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాను “” అని తెలిపారు రేణు (renu desai)