Mehreen Pirzada: రేప్ సీన్‌ని సెక్స్ అని ఎలా అంటారు?

మెహ్రీన్ పీర్జాదా (mehreen pirzada) ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువ‌గా తెలుగు సినిమాల్లో క‌నిపించ‌డంలేదు. F3 సినిమా త‌ర్వాత మెహ్రీన్ ఏ తెలుగు సినిమాకు సంత‌కం చేయ‌లేదు. ఇందుకు కార‌ణం ఆమె ఫోక‌స్ ప్ర‌స్తుతం బాలీవుడ్‌పై ఉన్న‌ట్టుండి. మిలాన్ లుథ్రియా అనే ద‌ర్శ‌కుడు డైరెక్ట్ చేసిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ (sultan of delhi) అనే వెబ్‌సిరీస్‌లో మెహ్రీన్ న‌టించింది.

ఈ వెబ్‌సిరీస్‌లో మెహ్రీన్ త‌న భ‌ర్త చేత అత్యాచారానికి గుర‌వుతుంది. దీనిని మ్యారిటల్ రేప్ అంటారు. అంటే భార్య‌కు ఇష్టం లేక‌పోయినా భ‌ర్త బ‌ల‌వంతంగా శృంగారం చేస్తే అది మ్యారిట‌ల్ రేప్ కిందికి వ‌స్తుంది. ఈ వెబ్‌సిరీస్‌లో మెహ్రీన్ ఇలాంటి సీన్‌లోనే న‌టించింది. అయితే కొన్ని మీడియా వ‌ర్గాలు, సోష‌ల్ మీడియా యూజ‌ర్లు ఈ మ్యారిట‌ల్ రేప్ సీన్‌ని సెక్స్ సీన్ అని సంబోధిస్తున్నార‌ని మెహ్రీన్ సెక్స్ సీన్‌లో న‌టించింది అని రాస్తున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఇలాంటి రివ్యూలు, కామెంట్స్ చ‌దివాక త‌న మన‌సు ఎంతో బాధ‌ప‌డింద‌ని ట్వీట్ చేసారు. (mehreen pirzada)

ఒక న‌టిగా త‌న వృత్తిలో స్క్రిప్ట్ డిమాండ్ చేసిన‌దానిని బ‌ట్టి కొన్ని నైతిక విలువ‌లు ప‌క్క‌న‌పెట్టాల్సి వ‌స్తుంద‌ని..తాను ఇప్ప‌టివ‌ర‌కు చేసిన హ‌నీ, మ‌హాల‌క్ష్మి పాత్ర‌లతో ఎలా ప్రేక్ష‌కుల‌ను అల‌రించానో ఇప్పుడు కూడా అలాగే ఆడియ‌న్స్ ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టాల‌ని చూస్తున్నాన‌ని తెలిపారు.