Navratri: శరన్నవరాత్రుల సమయంలో చేయకూడని పనులు
శరన్నవరాత్రులు (navratri) మొదలైపోయాయి. ఈరోజు మూడో రోజు. ఈ నవరాత్రుల సమయంలో చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. వాటి వల్ల అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి తెలిసీ ఈ పనులు మాత్రం చేయకండి.
మాంసం ముట్టకూడదు
ఈ తొమ్మిది రోజుల పాటు మాంసం ముట్టకపోవడమే మంచిది. ఎందుకంటే నవరాత్రులు అంటే స్వచ్ఛదనం, ఆధ్యాత్మికతతో కూడిన పండుగ. అందుకే చాలా మంది ఈ నవరాత్రులు అయ్యేవరకు మాంసం ముట్టరు. ఎక్కువగా ఉపవాసాలు ఉంటూ శాకాహారానికే ప్రధాన్యత ఇస్తారు.
మద్యానికి దూరం
మద్యం తాగడాలు వంటివి కూడా చేయకూడదు. ఇంట్లో ఆడవాళ్లు ఉపవాసాలు పూజలు చేస్తుంటారు. వారికి దూరంగా ఉంటూ మద్యం సేవించడం వంటివి చేస్తే ముత్తైదులు చేసే పూజలకు ఫలితం దక్కదు అంటారు. (navratri)
ఉల్లి వెల్లుల్లి తినకూడదు
ఈ తొమ్మిది రోజులు ఉల్లి, వెల్లుల్లి కూడా ముట్టకుండా ఎంతో నిష్ఠగా ఉంటారు. ఇవన్నీ అమ్మవారి పట్ల మనకు ఎంత భక్తి ఉందో తెలిపేందుకు చేసే పనులు.
తప్పుడు మాటలు మాట్లాడకూడదు
అమ్మవారి పూజలు చేస్తూ భక్తిలో మునిగి తేలుతుంటారు ఈ తొమ్మిది రోజులు. అందుకే బూతులు, తప్పుడు మాటలు మాట్లాడేవారి దగ్గర లక్ష్మీదేవి నిలవదు అంటారు.
జూదం ఆడటం తప్పు
ఈ తొమ్మిది రోజులు జూదం ఆడటం కూడా మహాపాపమే. అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉండాలే తప్ప ఇలాంటి దిక్కుమాలిన ఆటలకు దూరంగా ఉంటేనే మంచిది. (navratri)