Joe Biden: మాది ప్ర‌పంచంలోనే కాదు చ‌రిత్ర‌లోనే ప‌వ‌ర్‌ఫుల్ దేశం

అమెరికా (america) ప్ర‌పంచంలోనే కాదు చ‌రిత్ర‌లోనే ప‌వ‌ర్‌ఫుల్ దేశం అని కాల‌ర్ ఎగ‌రేసి మ‌రీ చెప్తున్నారు అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడు జో బైడెన్ (joe biden).  ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ దేశాల‌కు పెద్ద దిక్కుగా వ్య‌వ‌హరిస్తోంది. మ‌రి ఈ రెండు దేశాల‌ను చూసుకోవ‌డంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవా? అని మీడియా వ‌ర్గాలు జో బైడెన్‌ను ప్ర‌శ్నించ‌గా.. మాది అమెరికా. ప్ర‌పంచంలోనే కాదు.. చ‌రిత్ర‌లోనే ప‌వ‌ర్‌ఫుల్ దేశం. ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా ఇత‌ర దేశాల‌కు సాయం చేసే స‌త్తా మాకు ఉంది అని తెలిపారు.

ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌కు.. వాటి వ‌ల్ల ఏర్ప‌డే పరిణామాలు అమెరికా ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని బైడెన్ అన్నారు. ఒక‌వేళ ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంలో గెలిచి ఉంటే.. అప్పుడు యూర‌ప్‌లో యుద్ధం మొద‌లై ఉండేద‌ని తెలిపారు. అప్పుడు అమెరికా కూడా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో యుద్ధంలో దిగాల్సి వచ్చేద‌ని అన్నారు. రేపు బైడెన్ ఇజ్రాయెల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.  (joe biden)