Telangana People in Israel: కూతురి కల నెరవేర్చడం కోసం ఇజ్రాయెల్‌లోనే తండ్రి
ఇజ్రాయెల్‌లో (israel) జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. దాదాపు 500 మంది తెలంగాణ వాసులు ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్నారు. వారి కుటుంబాలు మాత్రం ఇక్కడే ఉంటున్నాయి. (telangana people in israel)
కూతురి కోసం తప్పదు
జగిత్యాలలోని బోంకూర్కి చెందిన రాజేష్ అనే వ్యక్తి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. రాజేష్‌కి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు డాక్టర్ చదవాలని ఆశపడుతోంది. దానికి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. అందుకే యుద్ధానికి కూడా భయపడకుండా.. భారత్ ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ప్రత్యేక విమానాన్ని పంపించినా కూడా అందులో ఎక్కడకుండా అక్కడే ఉండిపోయారు రాజేష్. బిడ్డను చదివించుకోవాలంటే డబ్బు కావాలని.. ఇప్పుడు యుద్ధానికి భయపడి తిరిగి స్వస్థలానికి చేరుకుంటే తన కూతురి భవిష్యత్తు పాడవుతుందని అంటున్నారు. (telangana people in israel)
టెల్ అవీవ్‌కు అంత ప్రమాదం లేదు
కాగా.. ఇజ్రాయెల్‌లో ఉంటున్న తెలంగాణ వాసులు తమ అసోసియేషన్ ద్వారా మీటింగ్స్ పెట్టుకుని ఎప్పటికప్పుడు పరిస్థితుల గురించి చర్చించుకుంటున్నారు. వెంటనే స్వస్థలాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎందుకంటే టెల్ అవీవ్ ప్రాంతానికి యుద్ధం కారణంగా అంతగా ప్రమాదం ఏమీ లేదని చెప్తున్నారు. (telangana people in israel)