Revanth Reddy: KCR ఎన్నికల్లో పోటీ చేయకపోతేనే బెటర్
తెలంగాణ సీఎం KCRపై మరోసారి వ్యంగ్యస్త్రాలు సంధించారు TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy). ఈరోజు KCR BRS పార్టీ మేనిఫెస్టోని ప్రకటించారు. ఈ మేనిఫెస్టో గురించి రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను అటు ఇటు మార్చి కాపీ కొట్టారని.. దీనిని బట్టి చూస్తే కేసీఆర్‌కు ఆలోచించే శక్తి కూడా లేదని క్లియర్‌గా అర్థమవతోందని అన్నారు. ఇక KCR త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో (telangana elections) పాల్గొనకపోవడమే మంచిదని.. ఈ వయసులో ఇక ఆయన పార్టీ బాధ్యతలు వేరొకరికి అప్పగించి తన ఫాం హౌస్‌లో శేష జీవితాన్ని గడిపితే బాగుంటుందని అన్నారు. BRS మేనిఫెస్టో చూసాక ఇక రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని క్లియర్‌గా అర్థమవుతోందని తెలిపారు.