KTR: లోకేష్ ట్వీట్.. నాకు నాన్న గుర్తొచ్చారు

చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ఆరోగ్య ప‌రిస్థితి గురించి నారా లోకేష్ (nara lokesh) ట్వీట్ చూసాన‌ని.. అది చూసి బాధ‌గా అనిపించింద‌ని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR. చంద్ర‌బాబుకి ప్రాణ‌హాని ఉంద‌ని లోకేష్ ట్వీట్ చేయ‌డం నిజంగా బాధాక‌రమైన విష‌య‌మ‌ని తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో త‌న‌కు త‌న తండ్రి KCR ఉప‌వాస దీక్ష గుర్తొచ్చింద‌ని అప్ప‌టి రోజుల‌ను గుర్తుచేసుకున్నారు. ఆనాడు KCR ఇంకొక్క రోజు దీక్ష చేసి ఉంటే చ‌నిపోయి ఉండేవార‌ని వైద్యులు చెప్పార‌ని ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రెండు రాజ‌కీయ పార్టీల వ్యవ‌హారం కావ‌డంతో ఇంత‌కు మించి స్పందించ‌లేక‌పోతున్నాన‌ని అన్నారు.