China: ఇజ్రాయెల్ దౌత్యాధికారిపై కత్తితో దాడి
ఓ పక్క భీకరమైన యుద్ధం మధ్య ఇజ్రాయెల్ (israel) నలిగిపోతుంటే.. చైనాలో (china) విధులు నిర్వర్తిస్తున్న ఇజ్రాయెల్ దౌత్యాధికారిపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇజ్రాయెల్ అధికారిని కత్తితో పొడిచి పారిపోయారు. వెంటనే ఆయన్ను దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. దాడికి ఎవరు పాల్పడ్డారు అనే దానిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇజ్రాయెల్‌పై శనివారం గాజాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడినప్పుడు చైనా అస్సలు స్పందించలేదు. కానీ చైనాకు ఎలాంటి కష్టమైనా వచ్చినప్పుడు మాత్రం ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ ఉండేది. అలాంటి చైనా ఇప్పుడు యుద్ధం కారణంగా నలిగిపోతున్న ఇజ్రాయెల్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు అంతంమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా రాజధాని బీజింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇజ్రాయెల్ దౌత్యాధికారిపై కత్తితో దాడి చేసిన ఘటన మరింత టెన్షన్లకు దారి తీసేలా ఉంది. (china)