Chandrababu Naidu: సుప్రీంకోర్టులో స్వ‌ల్ప ఊర‌ట‌

ఫైబ‌ర్ నెట్ కేసులో (fiber net) భాగంగా చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) కేసును సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. చంద్ర‌బాబు త‌ర‌ఫు లాయ‌ర్ సిద్ధార్థ్ లుత్రా త‌న వాద‌న‌లు వినిపిస్తూ ఈ ఫైబ‌ర్ నెట్ కేసులో ఆల్రెడీ ధ‌ర్మాసనం ముగ్గురికి ముంద‌స్తు బెయిల్ ఇచ్చింద‌ని అలాంట‌ప్పుడు చంద్ర‌బాబుకు ఎందుకు బెయిల్ రాద‌ని అన్నారు. వాదోప‌వాదాలు విన్న జ‌డ్జ్ ఈ కేసును మంగ‌ళ‌వారానికి వాయిదా వేసారు. అప్ప‌టివ‌ర‌కు ఈ కేసులో చంద్ర‌బాబును అరెస్ట్ చేయ‌డానికి వీల్లేద‌ని చెప్ప‌డంతో ఆయ‌న‌కు స్వల్ప ఊర‌ట ల‌భించింది.