Tadepalli: జ‌గ‌న్ ఇంటికి వెళ్ల‌నివ్వండి అంటూ TDP నేత‌ల ర‌చ్చ‌

తాడేప‌ల్లిలోని (tadepalli) ఏపీ సీఎం జ‌గ‌న్ (jagan) ఇంటికి TDP నేత‌లు పిల్లి మాణిఖ్యాల‌ రావు, బుద్ధా వెంక‌న్న ఇత‌ర నేత‌లతో క‌లిసి వెళ్లేందుకు య‌త్నించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే వారిని అదుపు చేసేందుకు య‌త్నించారు. దాంతో తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. జైల్లో ఉన్న చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ఆరోగ్యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్షించ‌మ‌ని కోరుతూ విన‌తి ప‌త్రం అంద‌జేయ‌డానికే జ‌గ‌న్ ఇంటికి వెళ్తున్నామ‌ని పోలీసుల‌కు తెలిపారు. కానీ వారిని జ‌గ‌న్ ఇంటికి పంపేందుకు పోలీసులు నిరాక‌రించారు.