Gaza: ఇక్క‌డెందుకు పుట్టించావురా భ‌గ‌వంతుడా..!

ఇజ్రాయెల్‌పై గాజాలోని (israel gaza war) హ‌మాస్ (hamas) ఉగ్ర‌వాదులు దాడులు చేయ‌డంతో.. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా (gaza) ప‌ని ప‌డుతోంది. ఇజ్రాయెల్ గాజాపై జ‌రిపిన బాంబుల వ‌ర్షంలో దాదాపు 1500 మంది హ‌మాస్ ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. అయితే గాజాలో నివ‌సిస్తున్న సాధారణ ప్ర‌జ‌లు మాత్రం అల్లాడిపోతున్నారు. ఈ గాజాలో ఎందుకు పుట్టించావురా భ‌గ‌వంతుడా అంటూ క‌న్నీరుమున్నీరవుతున్నారు. ఇజ్రాయెల్ చేప‌ట్టిన మెరుపుదాడుల్లో గాజాకు ప‌క్క‌నే ఉన్న రిమ‌ల్ న‌గ‌రం చెల్లాచెదురైపోయింది.

దాదాపు మూడు రోజులుగా గాజా ప్రాంతంలోని ప్ర‌జ‌ల‌కు నీరు, విద్యుత్తు లేక అల్లాడుతున్నారు. హ‌మాస్ బందీలో ఉన్న ఇజ్రాయెల్ వాసుల‌ను వ‌దిలిపెడితేనే గాజాకు నీరు, విద్యుత్తు అందుతుంద‌ని ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజమిన్ నేత‌న్యాహు వెల్ల‌డించారు. గాజాకు చెందిన దాదాపు 4,23,000 మంది ప్ర‌జ‌లు పాఠ‌శాల‌లు, ప‌బ్లిక్ బిల్డింగుల‌లో త‌ల‌దాచుకుంటున్నారు. ప్ర‌స్తుతం గాజా ప్ర‌జ‌ల‌కు అత్య‌వ‌స‌ర స‌హాయం కోసం ఎదురుచూస్తున్నారు. బ‌య‌టికి వ‌స్తే ఎవ‌రు ఎప్పుడు చంపేస్తారోన‌న్న భ‌యంతో ఆక‌లితో అల‌మ‌టిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.