ACB Court: దద్దరిల్లిన కోర్టు.. వెళ్లిపోయిన జడ్జ్..!
చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ఈరోజు ఏపీ ఏసీబీ కోర్టు (Acb court) వాదనలతో దద్దరిల్లింది. చంద్రబాబు నాయుడు తరఫు లాయర్.. AP CID తరఫు లాయర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయమూర్తి సైలెంట్‌గా ఉండాలని ఆదేశించినా వారు మాట వినకపోవడంతో ఆమె వాకౌట్ చేసారు. AP CID అధికారులు తమ కాల్ డేటా ఇవ్వాలని ఈరోజు TDP కోర్టులో పిటిషన్ వేసింది. ఈ విషయంలో ఇరు వైపు న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.