Nakka Anand Babu: జ‌గ‌న్ ఇంట్లోని చెల్లెళ్లకే భ‌రోసా లేదు..!

ఏపీ సీఎం జ‌గ‌న్ (jagan) చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu), ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల (pawan kalyan) గురించి చేసిన ఆరోప‌ణ‌ల గురించి స్పందించారు TDP నేత న‌క్క ఆనంద్ బాబు (nakka anand babu). జ‌గ‌న్ మాట్లాడితే నా అక్క‌చెల్లెమ్మ‌లు అంటుంటాడ‌ని.. మరి ఆయ‌న సొంత చెల్లెలి ప‌రిస్థితి గురించి ఎప్పుడూ ఎందుకు మాట్లాడ‌ర‌ని ప్ర‌శ్నించారు.

నా ఎస్సీలు నా ఎస్టీలు అన‌డానికి అత‌నెవ‌ర‌ని.. చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో వారికి కేటాయించిన‌వ‌న్నీ లాగేసుకుని ఇప్పుడు త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఎస్సీలు, ఎస్టీలు గుర్తొచ్చారా అని విమ‌ర్శించారు. అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు అవుతున్నా చంద్ర‌బాబు నాయుడుపై లేని కేసులు ఎన్నిక‌ల‌కు మూడు నాలుగు నెల‌ల స‌మ‌యం ఉన్నప్పుడే ఎందుకు పెట్టార‌ని.. అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడే పెట్టి ఉంటే అన్ని ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొని ఈపాటికి నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డేవార‌ని మండిప‌డ్డారు.