Jagan: దత్తపుత్రుడి నాలుగో పెళ్లి ఎవరితోనో..!
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తాను ప్రయత్నిస్తుంటే.. వద్దు అంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అడ్డుకున్నారని ఆరోపించారు ఏపీ సీఎం జగన్ (jagan). కాకినాడలోని సామర్లకోటలోని జగనన్న కాలనీలో ఇళ్లు పంచిపెట్టారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రసంగించారు.
“” రాష్ట్రంలో 72 వేల ఎకరాలు సేకరించి 30 లక్షల అక్కచెళ్లెమ్మలకు ఇచ్చాం. నేను అధికారంలోకి వచ్చినప్పుడు పేదలకు ఇళ్లు కేటాయించాలని నేను ప్రయత్నిస్తుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకోవాలని చూసాడు. వద్దు అంటూ కోర్టుల్లో కేసులు వేసారు. అలా ఓ వైపు చంద్రబాబు నాయుడు మరోవైపు కోవిడ్ ఈ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. కానీ నేను కింద మీద పడి ఏదో ఒకటి చేసి నా పేద ప్రజలకు ఇవ్వాలనుకున్నాను కానీ ఏ సాకులు చెప్పి తప్పించుకోలేదు. ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక ఉచితంగా ఇస్తున్నాం. ఒక్కో ఇంటి కోసం రూ.1,72,000 ఖర్చు చేస్తున్నాం.
చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా కనీసం సెంటు భూమిని ప్రజలకు ఇవ్వలేదు. కానీ నాకు మనసుంది కాబట్టి… ప్రతి ఆడబిడ్డకు సొంత చిరునామా అనేది ఉండాలని ఇళ్లు నిర్మించి ఇచ్చాను. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాడు. 35 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయినా కూడా కుప్పంలో పేదవాడి ముఖంలో చిరునవ్వు కనపడాలి అంటే అది జరిగింది మాత్రం నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే “” అని తెలిపారు. (jagan)
ఇక దత్తపుత్రుడి నాలుగో పెళ్లి ఎవరితోనో..!
ఈ సందర్భంగా జగన్.. జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) గురించి మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. పవన్ మొదటి భార్య లోకల్ అని రెండో భార్య నేషనల్ అని ఇక మూడో భార్య ఇంటర్నేషనల్ అని అసభ్యకరంగా మాట్లాడారు. ఇక నాలుగో పెళ్లి ఎవరితో జరుగుతుందో ఏమో అంటూ వ్యాఖ్యానించారు. పవన్ ఇల్లు హైదరాబాద్లో ఉంది కానీ అందులో ఉండే ఇల్లాలు మాత్రం మూడు నెలలకు ఓసారి మారుతూ ఉంటుందని అన్నారు.