Aishwarya Rai: అత్తగారితో విభేదాలు..?
ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కి (aishwarya rai) తన అత్తగారు జయ బచ్చన్‌తో (jaya bachchan) సమస్యలు ఉన్నాయా? ఐష్ పోస్ట్ చేసిన ఫోటో చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. నిన్న అమితాబ్ బచ్చన్ (amitabh bachchan) బర్త్‌డే. ఈ సందర్భంగా ఐష్ తన కూతురు ఆరాధ్యతో పాటు మరదలి పిల్లలు, అత్తగారు కలిసి అమితాబ్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసారు. ఆ తర్వాత కేవలం తన కూతురు అమితాబ్‌తో ఉన్న ఫోటోను మాత్రమే పోస్ట్ చేస్తూ బిగ్‌బికి విషెస్ తెలిపారు. అమితాబ్‌తో కలిసి ఆరాధ్య ఎన్నో ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను పోస్ట్ చేయకుండా.. అత్తగారు.. మరదలి పిల్లలు ఉన్న ఫోటోను క్రాప్ చేసి కేవలం తన కూతురు ఉన్న ఫోటోని మాత్రమే పోస్ట్ చేసింది. దాంతో ఐష్‌కి జయకి మధ్య విభేదాలు ఉన్నాయేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.