భార‌త్‌కు ప‌ట్టిన‌ పీడ వ‌దిలిపోతోంది..!

నెమ్మ‌దిగా భార‌త్‌కు (india) ప‌ట్టిన పీడ వ‌దిలిపోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎంద‌రో ఉగ్ర‌వాదులు (terrorist) విదేశాల్లో హ‌త‌మ‌య్యారు. వీరిలో దాదాపు అంద‌రూ భార‌త్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాదులే. ఇప్ప‌టివ‌ర‌కు ఎంత మంది ఉగ్ర‌వాదులు మ‌రణించారు.. ఎంత మంది త‌ప్పించుకున్నారో తెలుసుకుందాం.

షాహిద్ లతీఫ్‌ (shahid latif)

పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ 2011లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో దారుణ‌మైన ఉగ్రదాడి చేయించాడు. ఇత‌న్ని ఆల్రెడీ భార‌త ప్ర‌భుత్వం 1994లో అరెస్ట్ చేసి 2010లో రిలీజ్ చేసి పాకిస్థాన్‌కు తిరిగి పంపించేసింది. ఆనాడే చంపేసి ఉంటే పీడ‌పోయేది. ఏదైతేనేం.. ఓ భూ వివాదం కార‌ణంగా ల‌తీఫ్ పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో హ‌త్య‌కు గుర‌య్యాడు.

రియాజ్ అహ్మ‌ద్ (riyaz ahmed)

రియాజ్ అహ్మ‌ద్ అలియాస్ అబు కాసిమ్ ల‌ష్క‌రే తైబా టాప్ క‌మాండ‌ర్. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఢాంగ్రి ప్రాంతంలో ఉగ్ర‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో దాదాపు 7 మంది మృతిచెంద‌గా మ‌రో 14 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇదే ఏడాది సెప్టెంబ‌ర్‌లో పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లోని ర‌వాల్‌కోట్ జిల్లాలో జ‌రిగిన దాడిలో రియాజ్ అహ్మ‌ద్ హ‌త‌మ‌య్యాడు. (terrorist)

హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ (hardeep singh nijjar)

కెన‌డాలో స్థిర‌ప‌డిన ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ గ‌తేడాది జూన్‌లో ఓ గ్యాంగ్ జ‌రిపిన కాల్పుల్లో హ‌త‌మ‌య్యాడు. అయితే ఇత‌ని హ‌త్య వెనుక భార‌త్ హ‌స్తం ఉంద‌ని ఇప్ప‌టికే కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజ్జ‌ర్‌ను ఇండియా 2020లో ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించింది.

బ‌షీర్ అహ్మ‌ద్ పీర్ (basheer ahmad peer)

హిజ్బుల్ ముజ‌హిద్దీన్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన బ‌షీర్ అహ్మ‌ద్ పీర్ రావాల్పిండిలో జ‌రిగిన గొడ‌వ‌ల్లో హ‌త‌మ‌య్యాడు. జమ్ము కాశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల‌ను ఉసిగొల్పి ఎన్నో దాడులు చేయించాడు.

స‌య్య‌ద్‌ ఖ‌లీద్ ర‌జా (sayyad khalid raza)

అల్ బ‌ద‌ర్ అనే పాకిస్థాన్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన స‌య్య‌ద్ ఖ‌లీద్ ర‌జా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో క‌రాచీలో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు జ‌రిపిన కాల్పుల్లో హ‌త‌మ‌య్యాడు. (terrorist)

మిస్త్రీ జ‌హూర్ ఇబ్ర‌హీం (mistry zahoor ibrahim)

ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన IC 814 విమానాన్ని హైజాక్ చేసిన వ్య‌క్తే ఈ మిస్త్రీ జ‌హూర్ ఇబ్ర‌హీం. పాకిస్థాన్‌లోని క‌రాచీలో ఇద్ద‌రు గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు బైక్‌పై వ‌చ్చి కాల్పులు జ‌రిపి పారిపోయారు.

ప‌రంజీత్ సింగ్ పాన్వ‌ర్ (paramjeet singh panwar)

ఖ‌లిస్తానీ క‌మాండో ఫోర్స్ చీఫ్‌, ఉగ్ర‌వాది అయిన ప‌రంజీత్ సింగ్ పాన్వ‌ర్ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఇదే ఏడాది మేలో ఇద్ద‌రు వ్య‌క్తుల చేతిలో హ‌త‌మ‌య్యాడు. భార‌త్‌లో ఎన్నో మ‌ర్డ‌ర్లు, కిడ్నాప్‌లే చేసి డ్ర‌గ్ డీలింగ్ చేసిన కేసుల్లో ప‌రంజీత్ ప్ర‌ధాన నిందితుడు.

లాల్ మ‌హ‌మ్మ‌ద్ (laal mohammad)

పాక్ ISI ఏజెంట్ అయిన లాల్ మ‌హ‌మ్మ‌ద్ నేపాల్ రాజ‌ధాని క‌ఠ్మాండు వ‌ద్ద ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 19న హ‌త్య‌కు గుర‌య్యాడు. ఇంటెలిజెన్స్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఇండియాలో అత్య‌ధికంగా దొంగ నోట్లు స‌ర‌ఫ‌రా చేసేది ఈ లాల్ మ‌హ‌మ్మ‌దే.

వీరు త‌ప్పించుకున్నారు

భార‌త్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాదుల జాబితాలో ఉన్న కొంద‌రు దాడుల నుంచి త‌ప్పించుకున్నారు. జ‌మాత్ ఉద్ ద‌వా చీఫ్ ముంబై ఎటాక్ మాస్ట‌ర్ మైండ్ హ‌ఫీజ్ స‌యీద్ 2021లో లాహోర్‌లోని త‌న ఇంటి వ‌ద్ద జ‌రిగిన బాంబు దాడి నుంచి త‌ప్పించుకున్నాడు.

భార‌త పార్ల‌మెంట్‌పై దాడి చేసిన జైషే మ‌హ‌మ్మ‌ద్ నేత మౌలానా మ‌సూద్ అజ‌ర్ అనే ఉగ్ర‌వాది పెషావార్‌లోని మ‌ద్రాసాలో త‌ల‌దాచుకుండేవాడు. ఇత‌ను ఉరీ, ప‌ఠాన్‌కోట్, పుల్వామా దాడులకు పాల్ప‌డిన సూత్ర‌ధారుల్లో ఒక‌డు. 2019 ఫిబ్ర‌వ‌రిలో బాలాకోట్‌లోని జైషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర శిబిరాల‌పై భార‌త్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసిన స‌మ‌యంలో ఇత‌ను పెషావ‌ర్‌లోని మ‌ద్రాసాలో శ‌ర‌ణార్ధిలాగా త‌ల‌దాచుకున్నాడు. రెండు నెల‌ల త‌ర్వాత మ‌సూద్ త‌ల‌దాచుకున్న ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ జ‌రిగింది. ఈ దాడి నుంచి మ‌సూద్ తృటిలో త‌ప్పించుకున్నాడు. అప్ప‌టినుంచి ఇత‌ను ఏమైపోయాడు అనేది ఎవ్వ‌రికీ తెలీలేదు.