షుగర్ ఉంద‌ని విమానం నుంచి దించేసారు..!

ఓ ప్ర‌యాణికురాలికి షుగర్ వ్యాధి (diabetes) ఉంద‌ని తెలిసి ఆమెను విమానం నుంచి దించేసిన ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది. హెలెన్ టేల‌ర్ అనే మ‌హిళ త‌న భ‌ర్త‌తో క‌లిసి రోమ్ వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆమె విమానం ఎక్కిన కొద్దిసేప‌టికే మూత్రం వ‌స్తోంద‌ని బాత్రూమ్‌కి వెళ్లొచ్చా అని ఎయిర్ హోస్టెస్‌ను అడిగింది. ఆ స‌మ‌యంలో విమానంలోకి ఇంకా ప్ర‌యాణికులు ఎక్కుతూ ఉన్నారు. దాంతో ఎయిర్ హోస్టెస్ వెళ్ల‌మ‌ని చెప్పింది. హెలెన్ బాత్రూమ్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక ఆమెను విప‌రీతంగా చెమ‌ట‌లు ప‌డుతుంటే ఎయిర్ హోస్టెస్ ఏమైంది అని అడిగింది . త‌న‌కు షుగ‌ర్ వ్యాధి ఉంద‌ని హెలెన్ ఎయిర్ హోస్టెస్‌కు చెప్పింది. దాంతో ఎందుకొచ్చిన గొడ‌వ అని ఆమెను విమానం నుంచి దించేసారు. ఆ త‌ర్వాత విమాన సంస్థ వారికి రీఫండ్ ఇచ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.