Sreeleela మోక్ష‌జ్ఞ‌కు పెళ్లంటూ షాకింగ్ థంబ్ నెయిల్స్

బిజీ హీరోయిన్ శ్రీలీల (sreeleela) గురించి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి షాకింగ్ రూమ‌ర్స్ రాలేదు. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ బ‌బ్లీ హీరోయిన్‌పై కావాలంటే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆమె టీం మండిప‌డుతోంది. ప్ర‌స్తుతం శ్రీలీల నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి (nelakonda bhagavanth kesari) సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో నంద‌మూరి బాల‌కృష్ణ కుమారుడు మోక్ష‌జ్ఞ (mokshagna) శ్రీలీల‌ను క‌లిసి కాసేపు స‌ర‌దాగా మాట్లాడాడు. వీరిద్ద‌రూ మాట్లాడుకుంటున్న ఫోటో కూడా సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది.

ఇటీవ‌ల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన‌ప్పుడు కూడా బాల‌కృష్ణ మోక్ష‌జ్ఞ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విష‌యం చెప్పారు. శ్రీలీల ప‌క్కన హీరోయిన్‌గా న‌టించాల‌ని ఉంద‌ని మోక్ష‌జ్ఞ‌కు చెప్పిన‌ప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ బ‌ల్సిందా అని అన్నాడ‌ని.. భ‌విష్య‌త్తులో శ్రీలీల‌తో త‌న‌కు క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని అన్నాడ‌ని తెలిపారు. దాంతో ఇప్పుడు శ్రీలీల మోక్ష‌జ్ఞ‌ల గురించి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వ్యూస్ కోసం త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నాయి. శ్రీలీల మోక్ష‌జ్ఞ‌లు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ షాకింగ్ థంబ్ నెయిల్స్‌తో వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇది శ్రీలీల టీం దృష్టికి రావ‌డంతో వారు షాక‌య్యారు. ఇలాంటి చెత్త థంబ్ నెయిల్స్‌తో వీడియోలు చేస్తే ఫిర్యాదులు చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. (sreeleela)