Prabhas: వైర‌ల్ అవుతున్న ప్ర‌భాస్ అనుష్క పెళ్లి ఫోటోలు..!

రెబెల్ స్టార్ ప్ర‌భాస్.. (prabhas) అనుష్క శెట్టిల (anushka) జోడీ చూడ‌టానికి ఎంత చూడ ముచ్చ‌ట‌గా ఉంటుందో మ‌నంద‌రికీ తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ హిట్లే. అయితే.. కొంద‌రు ఫ్యాన్స్ మాత్రం వీరిద్ద‌రూ క‌లిసి న‌టించ‌డ‌మే కాదు క‌లిసి జీవితం పంచుకుంటే ఎంత బాగుంటుందో అని క‌ల‌లు కంటున్నారు. ప్ర‌భాస్, అనుష్క‌ల పెళ్లి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నారు.

అది జ‌రుగుతుందో లేదో దేవుడే నిర్ణ‌యించాలి కానీ.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఉంటే వారిద్దరికీ మ‌న‌మే పెళ్లి చేసేయొచ్చు క‌దా..! ఇలాగే ఆలోచించారు కొంద‌రు ఫ్యాన్స్. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్ర‌భాస్ అనుష్క‌ల‌కు పెళ్లి అయిపోయిన‌ట్లు వీరికి ఒక పాప పుట్టిన‌ట్లు ఫోటోల‌ను జ‌న‌రేట్ చేసారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. నిజంగా వీరి పెయిర్ చూడ‌టానికి చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.