Air Pollution: ఊపిరితిత్తులను కాపాడుకోవడం ఎలా?
వాయు కాలుష్యం (air pollution) రోజురోజుకీ పెరిగిపోతున్న క్రమంలో దాని ప్రభావం మన ఊపిరితిత్తులపై (lungs) తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందులోనూ దీపావళి పండుగ దగ్గరపడుతున్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వాయు కాలుష్యం కారణంగా మనం పీల్చుకునే గాలిలో విషపూరిత వాయువులు కూడా ఉంటాయి. వాటి వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తీవ్రం అవుతాయి. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఊపిరితిత్తులకు రక్షణ కల్పించవచ్చు.
*మీ ప్రాంతంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని మీకు అనిపిస్తే ఇంట్లోనే ఉండటం బెటర్. ఆఫీస్‌కి వెళ్లాలన్నా.. లేదా అత్యవసరంగా బయటికి వెళ్లాల్సి వచ్చినా తప్పనిసరిగా మాస్కులు వేసుకోండి. వాకింగ్ వంటివి ఇంట్లోనే చేసుకోవడం ఉత్తమం. (air pollution)
*ఇంటి వాతావరణం కూడా శుభ్రంగా ఉండాలి. కుదిరితే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను పెట్టించుకోండి.
*ఏరోబిక్స్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు ఊపిరితిత్తులను స్ట్రాంగ్‌గా ఉంచుతాయి.
*సిగరెట్లు తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. మీరు సిగరెట్లు తాగుతూ బయట కాలుష్యం ఎక్కువగా ఉంది అనుకోవడం మూర్ఖత్వం.
*ఒకవేళ మీకు స్మోకింగ్ అలవాటు లేకపోయినా ప్యాసివ్ స్మోకింగ్‌కి కూడా దూరంగా ఉండాలి. అంటే మీ చుట్టూ ఉన్నవారు స్మోకింగ్ చేస్తున్నప్పుడు అది మీరు పీల్చినా దాని ప్రభావం రెండింతలు ఎక్కువే ఉంటుంది. (air pollution)
*మీకు ఆల్రెడీ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకుంటూ ఉండండి.
*ఇవే కాకుండా సరిపడా నిద్ర కూడా ఎంతో ముఖ్యం. నిద్ర బాగా పడితేనే శరీరం బయటి నుంచే కాకుండా లోపలి నుంచి కూడా రిపేర్ అవుతుంది. (air pollution)
*న్యుమోనియా ఇతర ఫ్లూలకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి వాటిని వేసుకోవచ్చో లేదో తెలుసుకోండి.
*కాలుష్యం వల్ల ఆక్సిడేటివ్ ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ ఒత్తిడిని అధిగమించాలంటే పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన ఆహారం తినడం తప్పనిసరి.
*ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. బయటికి వెళ్లి వస్తే తప్పనిసరిగా స్నానం చేయడం మర్చిపోకండి.