Supreme Court: ప్రాణంతో ఉన్న బిడ్డను చంపాల‌ని ఏ కోర్టు చెప్తుంది?

అబార్ష‌న్ కోసం పిటిష‌న్ వేసుకున్న ఓ జంటపై సుప్రీంకోర్టు (supreme court) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆల్రెడీ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన ఓ మ‌హిళ ఇప్పుడు మూడోసారి గ‌ర్భం దాల్చింది. కానీ మూడో బిడ్డ‌ను క‌ని పెంచే స్థితిలో వారు లేరు. దాంతో అబార్ష‌న్ చేయించుకునేందుకు ప‌ర్మిష‌న్ కావాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు ఆ మ‌హిళ మాన‌సిక, శారీర‌క ఆరోగ్యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అబార్ష‌న్‌కు అనుమ‌తి ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో ప్రొసీజ‌ర్ ప్ర‌కారం.. మ‌హిళ త‌ర‌ఫు న్యాయ‌వాది ఎయిమ్స్ నుంచి మెడిక‌ల్ రిపోర్ట్‌ను కోర్టులో స‌బ్మిట్ చేసారు. ఆ రిపోర్ట్‌లో బిడ్డ నెల‌లు నిండ‌కుండా పుట్టినా బ‌తికే ఛాన్స్ ఉన్న‌ట్లు రాసి ఉంది. అది చూసి జ‌డ్జ్ షాక‌య్యారు. ఈ రిపోర్ట్‌ను ముందే ఎందుకు ఇవ్వ‌లేదు అని మండిప‌డ్డారు. ఇప్పుడు బిడ్డ కండీష‌న్ బాగానే ఉంద‌ని.. నెల‌లు నిండ‌కుండా పుట్టినా ఆరోగ్యంగా జీవిస్తుంద‌ని తెలిసీ ఎలా అబార్ష‌న్‌ను అనుమ‌తించాలి అని బాధితురాలి త‌ర‌ఫు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించారు. ఈ కేసు తీర్పును వాయిదా వేస్తూ.. త‌దుప‌రి హియ‌రింగ్‌లో బాధితురాలి వాద‌న వినాల‌నుకుంటున్న‌ట్లు న్యాయ‌మూర్తి ఆదేశాలు జారీ చేసారు. ఏ కోర్టు కూడా క‌డుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నా కూడా అబార్ష‌న్ చేయించాల‌ని తీర్పు ఇవ్వ‌ద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేసారు. (supreme court)