Chandrababu: జైల్లో చంద్రబాబుకు అనారోగ్యం..!
రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు (chandrababu) అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. తనకు జైలులో డీహైడ్రేషన్ అవుతోందని వైద్యాధికారితో వెల్లడించారట. మొన్న ములాఖత్ సమయంలో తన కుటుంబ సభ్యులతో కూడా ఇదే విషయాన్ని వెల్లడించారట. రాజమండ్రిలో విపరీతంగా ఎండలు ఉన్న నేపథ్యంలో జైల్లో సరైన వసతులు లేకపోవడం వల్ల ఆయన డీహైడ్రేట్ అయ్యారు.