Ranbir Kapoor: మ‌ద్యం, మాంసంకి దూరం

ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ (nitish tiwari) రామాయ‌ణం (ramayan) ఆధారంగా సినిమా తీయ‌బోతున్నారు. ఇందులో రాముడి పాత్ర‌లో ర‌ణ్‌బీర్ క‌పూర్ (ranbir kapoor) న‌టించ‌నున్నారు. సీత‌మ్మ పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి (sai pallavi) న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాముడి పాత్రలో న‌టించాలి కాబ‌ట్టి కాస్త నిష్ఠ‌గా ఉండాల‌ని ర‌ణ్‌బీర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ అయ్యేంత‌వ‌ర‌కు మ‌ద్యం, మాంసాహారానికి దూరంగా ఉండ‌నున్నాడ‌ట‌.

ముందు ఈ సినిమాలో సీత పాత్ర‌లో ఆలియా భ‌ట్‌ని (alia bhatt) అనుకున్నారు నితీష్ తివారీ. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల సాయి ప‌ల్ల‌వి అయితే బాగుంటుంది అనుకున్నార‌ట‌. ఈ సినిమా గురించి ప‌ల్ల‌వితో చ‌ర్చించ‌గా త‌ను కూడా ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక రావ‌ణాసురుడి పాత్ర కోసం క‌న్న‌డ న‌టుడు యష్‌ని (yash) సంప్ర‌దించ‌గా ఆయ‌న తిర‌స్క‌రించారు.