Nara Lokesh: గూగుల్‌లో దొరికే ప్ర‌శ్న‌లే వేసారు

అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు (amaravathi inner ring road) కేసులో భాగంగా ఈరోజు AP CID నారా లోకేష్‌ను (nara lokesh) విచార‌ణ చేసిన సంగ‌తి తెలిసిందే. తాడేప‌ల్లిగూడెంలోని సిట్ కార్యాల‌యంలో ఈ విచార‌ణ జరిగింది. విచార‌ణ ముగిసిన అనంత‌రం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. అస‌లు లేని ఇన్న‌ర్ రింగ్ రోడ్డుపై దాదాపు 49 ప్ర‌శ్న‌లు అడిగార‌ని. ఆ ప్ర‌శ్న‌లు గూగుల్‌లో కొట్టినా కూడా సమాధానాలు దొరుకుతాయ‌ని అన్నారు. ఈరోజే విచార‌ణ ముగించండి అని అడిగితే.. లేదు రేపు రావాల్సిందే మ‌ళ్లీ విచార‌ణ‌కు అన్నార‌ని తెలిపారు. సో రేపు కూడా షార్ప్ 10 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతానని పేర్కొన్నారు.