Chandrababu Naidu కి జీవిత ఖైదు..?
చంద్రబాబు నాయుడుకి (chandrababu naidu) జీవిత ఖైదు శిక్ష పడుతుందా? కేసుల పూర్వాపరాలు చూస్తే అలాగే అనిపిస్తోందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం (skill development scam) కేసులో సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరుగుతుండగా.. మీరు అవినీతి మీద వాదించకుండా 17ఏ చుట్టూ ఎందుకు వాదిస్తున్నారు అని న్యాయమూర్తులు ఇప్పటికే లాయర్లకు మొట్టికాయలు వేసారు అని పత్రిక కథనాల్లో చూస్తున్నాం.
అవినీతి జరగలేదు అంటే అది నిరూపించడానికి కొన్నేళ్లు పడుతుందని చంద్రబాబు లాయర్లకు తెలుసు. అందుకే సాంకేతిక కారణాలు చూపుతూ ఈ కేసుని కొట్టివేయించాలి అన్నది లాయర్ల ఆలోచన. అందుకే 17A చుట్టే ఎక్కువగా లాయర్లు వాదిస్తున్నాట్లు తెలుస్తోంది. ఒకవేళ 17A వర్తించదు అంటే కేసు కొట్టేయడం కుదరదు. 17A వర్తిస్తుంది అంటే కేసు చెల్లదు. ఒకవేళ కేసు చెల్లదు అంటే గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోని మళ్ళీ కేసుని రీరిజిస్టర్ చేయించి అరెస్ట్ చేయవచ్చు. కాబట్టి 17A వర్తించదు అంటే కొంత కాలం ఉపశమనం దొరుకుతుందే తప్ప పూర్తిగా కేసు కొట్టివేయడానికి లేదు. అవినీతి నిరోధక కేసుల గురించే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటున్నాము కానీ చంద్రబాబు పైన 409 కూడా నమోదు అయ్యింది.
409 అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇది ఇంకా పెద్ద కేసు. 409 నిరూపితమైతే 10 ఏళ్ళు.. కేసు ఇంకా బలంగా ఉంటే జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడుకి 17A వర్తిస్తుంది అని చెప్పినా కూడా వెనక మరో మూడు కేసులు రెడీగా ఉన్నాయి. కాబట్టి ఇప్పట్లో చంద్రబాబుకి ఉపశమనం లేనట్లే కనిపిస్తోంది. మరోపక్క ఏపీ సీఎం జగన్ ఇదే మంచి సమయం అన్నట్లు మార్చిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నట్లు ప్రకటించారు.