Chandrababu: బెయిల్, కస్టడీ పిటిషన్ల కొట్టివేత
చంద్రబాబు నాయుడుపై (chandrababu) ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాగంగా బెయిల్, కస్టడీ పిటిషన్లను AP ACB కోర్టు కొట్టివేసింది. చంద్రబాబుకు తరఫు లాయర్లు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా.. AP CID అధికారులు మరో రెండు రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేసారు. ఈ రెండింటినీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు రిమాండ్‌ను ఈ నెల 19 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మరోపక్క సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.