Elections: నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు
తెలంగాణలో ఎన్నికలు (telangana assembly elections) నవంబర్ 30న జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 3న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయని తెలిపారు. 5 రాష్ట్రాల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో నవంబర్ 3 నుంచి నామినేషన్లు జరగనున్నాయి. ఎన్నికల కోసం ఆరు నెలలు కసరత్తు చేసామని చీఫ్ ఎన్నికల కమిషనర్ సంజీవ్ కుమార్ తెలిపారు.
5 రాష్ట్రాల్లోని 679 నియోజకవర్గాల్లో ఎన్నికలు
తెలంగాణలో మొత్తం 3,17,17,389 ఓటర్లు
తెలంగాణలోని మొత్తం పోలింగ్ కేంద్రాలు – 35,350
27,798 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్
ఎన్నికల కోసం 72,000 బ్యాలెట్ యూనిట్లు
5 రాష్ట్రాల్లో 8.2 పురుష ఓటర్లు, 7.8 కోట్ల మహిళా ఓటర్లు
ఎన్నికల కోసం 57 వేల కంట్రోల్ యూనిట్లు
80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 4.43 లక్షలు. వీరికి ఇంట్లో నుంచే ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయం.
5 రాష్ట్రాల్లో 62 లక్షల మంది కొత్త ఓటర్లు. (telangana assembly elections)