Mama Mascheendra: రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే OTTలోకి..!

సుధీర్ బాబు (sudheer babu) న‌టించిన మామా మ‌శ్చీంద్ర (mama mascheendra) సినిమా OTTలోకి వ‌చ్చేస్తోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే OTT రిలీజ్ డేట్ రావ‌డం ఇప్ప‌టివ‌ర‌కు సుధీర్ బాబు కెరీర్‌లోనే జ‌ర‌గ‌లేదు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం సుధీర్ బాబు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. మూడు గెట‌ప్స్‌లో అలరించాల‌నుకున్నారు. కానీ ఆ ప్ర‌య‌త్నం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేదు. ఇంకా సినిమా థియేట‌ర్ల‌లో ఉంటే ఆడే ఛాన్స్ లేద‌ని ముందే అనుకున్నారో ఏమో… ప్ర‌ముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైంకు (amazon prime) స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చారు. అక్టోబ‌ర్ 20 నుంచి ఈ సినిమా ప్రైంలో అందుబాటులో ఉంటుంది.