Namrata Shirodkar: సుధీర్ బాబుకి న‌మ్ర‌త సాయం

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుకి (mahesh babu) బావ అయిన సుధీర్ బాబు (sudheer babu) కోసం మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ (namrata shirodkar) సాయం చేస్తోంద‌ట‌. సుధీర్ బాబు న‌టించిన మామా మ‌శ్చీంద్ర (mama mascheendra) సినిమా నిన్న రిలీజ్ అయింది. సినిమా టాక్ యావ‌రేజ్‌గా ఉంది. సినిమాకు మ‌రిన్ని థియేట‌ర్లు కావాల‌ని సుధీర్ న‌మ్ర‌త‌ను రిక్వెస్ట్ చేసార‌ట‌. ఇందుకోసం న‌మ్ర‌త ప్ర‌ముఖ ఎగ్జిబిట‌ర్ అయిన సునీల్ న‌రంగ్‌తో (sunil narang) మాట్లాడార‌ని తెలుస్తోంది. మ‌హేష్‌కి చెందిన AMB థియేట‌ర్‌లో సునీల్ న‌రంగ్‌కి కూడా వాటా ఉంది. దాంతో సునీల్ కూడా మ‌రిన్ని థియేట‌ర్స్ కేటాయించేందుకు సాయం చేస్తాన‌ని చెప్పిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.