Shivraj Singh Chauhan: నన్ను మళ్లీ సీఎం అవ్వమంటారా?
రానున్న ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (shivraj singh chauhan) మళ్లీ పోటీ చేస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిండోరీ ప్రాంతంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. “” నేను ప్రభుత్వాన్ని బాగా నడిపానా? నా పనితీరు మీకు నచ్చిందా? మళ్లీ మీ మామా (శివరాజ్ సింగ్‌ను మధ్యప్రదేశ్లో మామా అని పిలుస్తారు) సీఎం అవ్వాలని అనుకుంటున్నారా? మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అవ్వాలని అనుకుంటున్నారా? “” అని అడగ్గా.. ఇందుకు అక్కడి ప్రజలు అవును అని సమాధానం ఇచ్చారు.
మరోపక్క ఇదే మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాలో కాంగ్రెస్ (congress) తరఫున ప్రియాంక గాంధీ (priyanka gandhi) ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో శివరాజ్ సింగ్ మళ్లీ సీఎం అవ్వలేరని అన్నారు. “” ఎప్పుడైనా మధ్యప్రదేశ్‌కు మోదీ వస్తే అసలు శివరాజ్ సింగ్ పేరు తీయడానికే ఆయన సిగ్గుపడుతున్నారు. మోదీ BJPకి ఓటు వెయ్యండి అని అంటున్నారు కానీ శివరాజ్ సింగ్‌ను గెలిపించండి అని మాత్రం అనడంలేదు దీనిని బట్టి చూస్తే ఇక మళ్లీ శివరాజ్ సింగ్ సీఎం అవ్వలేరు అని క్లియర్‌గా తెలుస్తోంది “” అని వెల్లడించారు ప్రియాంక.