Hanuman Chalisa ఎప్పుడు చదవాలి?
ఆంజనేయ స్వామి కృప పొందేందుకు హనుమాన్ చాలీసా చదువుతుంటారు. హనుమాన్ చాలీసా (hanuman chalisa) చదవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అన్ని మంత్రాల్లో అత్యంత శక్తిమంతమైన హనుమాన్ చాలీసా పఠిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
*సక్సెస్, డబ్బు ఎల్లప్పుడూ మనతో ఉండాంటే రోజూ మధ్యాహ్న సమయంలో హనుమాన్ చాలీసాను 11 సార్లు చదవాలట.
*గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న వారు హనుమాన్ చాలీసాను 108 రోజులు 108 సార్లు పటిస్తే ఎంతో మంచిది.
*అనారోగ్య సమస్యలు బాధిస్తుంటే బ్రహ్మ ముహూర్త వేళల్లో 40 రోజుల పాటు 31 సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. (hanuman chalisa)
*భయం పోయి, మానసికంగా దృఢంగా ఉండటం కోసం సూర్యాస్తమయ వేళల్లో 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి.
*ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, పీడలు తొలగిపోవాలంటే సాయంత్రం వేళల్లో 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుతూ ఇల్లంతా ధూపం వేయాలి.
*కోర్టు కేసుల ఇబ్బందులు ఉంటే హనుమాన్ చాలీసాను సాయంత్రం వేళల్లో 21 సార్లు జపిస్తే ఆ సమస్యలు త్వరగా తీరుతాయి.
*శతృ పీడ తొలగిపోవాలంటే నిష్ఠగా 11 సార్లు రోజూ హనుమాన్ చాలీసా చదవండి.
*కోరుకున్న కెరీర్, జీవితంలో విజయం సాధించాలంటే జీవితాంతం రోజూ 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి.
*పేరు, బంగారు భవిష్యత్తు కోసం నిర్ధిష్ట సమయానికి 21000 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం పూర్తిచేయాలి. ఈ నియమాన్ని పాటించాలనుకుంటే ఆంజనేయ స్వామి ఆలయంలోని పూజారిని సంప్రదించాలి. (hanuman chalisa)