Tiger Nageswara Rao: ఆ భాషలో రిలీజ్ కానున్న ఏకైక తెలుగు సినిమా
మాస్ మహారాజా రవితేజ (raviteja) నటించిన టైగర్ నాగేశ్వరరావు (tiger nageswara rao) సినిమాను మొట్ట మొదటిసారి భారతీయ సైన్ లాంగ్వేజ్‌లో (ISL) రిలీజ్ చేస్తున్నారు. బదిర బాధితుల కోసం ఈ సినిమాను ఈ భాషలో రిలీజ్ చేయాలని టీం నిర్ణయించింది. అంతేకాదు ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ అవుతోంది. రవితేజకు తొలి ప్యాన్ ఇండియన్ సినిమా ఇది. ఇందులో రేణూ దేశాయ్ (renu desai) కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ (nupur sanon) ఇందులో హీరోయిన్. వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ అవబోతోంది.