Putin: ప్రిగోజిన్ మృత‌దేహంపై గ్రెనేడ్ దాడి ఆన‌వాళ్లు

ఆగ‌స్ట్‌లో విమానం కూలిపోయిన ఘ‌ట‌న‌లో ప్రైవేట్ సైన్యం వాగ్న‌ర్ గ్రూప్ అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్ (prigozhin) దుర్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ప్రిగోజిన్‌ను చంపింది ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతినేన‌ని (putin) చాలా మంది ఇప్ప‌టికీ అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే పుతిన్‌పై తిరుగుబాటు చేయ‌డానికి వాగ్న‌ర్ సంస్థను ఏర్పాటుచేసాడు ప్రిగోజిన్.

అయితే… ఇప్పుడు పుతిన్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రిగోజిన్ బాడీలో చేత్తో త‌యారుచేసిన గ్రెనేడ్ల దాడి జరిగిన‌ట్లు ర‌ష్యా ఇన్‌వెస్టిగేటివ్ ఏజెన్సీ చేప‌ట్టిన విచార‌ణ‌లో తేలింది. విమానాన్ని బ‌య‌ట నుంచి ఎవ్వ‌రూ దాడి చేయ‌లేద‌ని కూడా విచార‌ణ‌లో తేలింద‌ని పుతిన్ వెల్ల‌డించారు. విమానం కూలిన ఘ‌ట‌న త‌ర్వాత ప్రిగోజిన్‌తో పాటు ఇత‌ర ప్రయాణికులు మ‌ద్యం, డ్ర‌గ్స్ లాంటివి ఏవైనా తీసుకున్నారా అనే విష‌యంపై ద‌ర్యాప్తు చేయ‌నందుకు అధికారుల‌పై పుతిన్ మండిప‌డ్డారు. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లోని ప్రిగోజిన్ కార్యాల‌యాల్లో డ‌బ్బు క‌ట్ట‌లు, కొకైన్ ల‌భించిన‌ట్లు కూడా తెలిపారు. (vladimir putin)