Sanjay Singh: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో AAP నేత అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఆప్ (aap) నేత సంజయ్ సింగ్‌ను (sanjay singh) అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మనీష్ సిసోదియా (manish sisodia) అని ఆరోపిస్తూ ఆయన్ను ఫిబ్రవరిలో జైలుకు తరలించారు. ఈరోజు ఉదయం నుంచి ఈడీ అధికారులు సంజయ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ కేసులో ఇది మూడో అరెస్ట్. మొదట సత్యేంతర్ జైన్, ఆ తర్వాత మనీష్ సిసోదియా ఇప్పుడు సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. లోక్ సభ ఎన్నికలకు (lok sabha elections) కొన్ని నెలల ముందే aap రాజ్యసభ ఎంపీ అరెస్ట్ అవ్వడం ఆ పార్టీకి గట్టి దెబ్బ అనే చెప్పాలి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అనే వ్యాపారవేత్త అప్రూవర్‌గా మారి సంజయ్ సింగ్ పేరు చెప్పడంతో ఈడీ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది. తనను సిసోదియాకు పరిచయం చేసింది సంజయే అని దినేష్ అరోరా విచారణలో బయటపెట్టడంతో సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.